Friday, 4 July 2025

మళ్ళీ ఉద్యోగంలో చేరాను!??

తెల్లవారు ఝామున వచ్చిన కల ఇది.రావు గారింట్లో ఉద్యోగానికి చేరాను.నిజానికి ఇంకా ఏమి పని చేయాలో చెప్పలేదు ఆయన.వచ్చి రెడీ అయి రమ్మన్నాడు.చిన్న పిల్లలు పరిగెత్తినట్లు పరుగెత్తుకుంటూ మైథిలీ వాళ్ళ ఇంటికి వెళ్ళాను.వాళ్ళ పని అమ్మాయి వాకిలి చిమ్ముతూ ఉంది.నేను తలుపు తట్టే లోపలే మైథిలి తలుపు తీసింది.నేను మాట్లాడబోతుంటే ఆ పని అమ్మాయి కూడా మాట్లాడేస్తుంది.ఆ పిల్లని ఒక్క సారి ఆగమని చెప్పాను.మైథిలి హడావుడి పడుతూ ఉంది టిఫిన్,వంట ఒకే సారి ఎలా చెయ్యాలని.వంటకు తొందర లేదు లేవే,నేను అన్నానికి ఇంటికి వస్తాను.నువ్వు ఆఫీసు నుంచి వచ్చేచప్పుడు చెబితే నేను కలుసుకుంటాను అని చెప్పాను.ఆయన ఎంత ఇస్తానన్నాడు జీతం అని అడిగింది.చాలా తక్కువ ఇస్తాడని విన్నాను అంది.నేను చెప్పాను.అలా ముందరగా చెప్పకపోవటం కూడా మంచిదే లే.నేను CAIIB 1&2 చేసి ఉన్నాను కదా!ముందరే తక్కువ చెబితే,నా పని బాగున్నా రెండో నెలకే పెంచరు కదా.నా ప్రతిభ,పనితనం చూస్తే,మంచిగా జీతం ఇస్తారు.అదీ కాకుండా నాకు తోచక కదా చేరింది అని చెప్పాను.సరేలే నీ ఇష్చం అంది మైథిలి.