Thursday, 17 July 2025

రాత్రి అంతా బాబు(నాన్న)ఆలాపన

రాత్రి కలలో బాబు కనిపించాడు.ఇంట్లో నుంచి బయటకు వెళ్ళాడు.ఫోన్ చేస్తే ఎత్తటం లేదు.వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాడేమో,పిలుచుకొని వస్తామని బయలు దేరాను.నేను నెల్లూరు వెళ్ళాను అని ఫోన్ చేసి చెప్పాడు.అదేంది?వస్తున్నానని చెప్పాను కదా!ఇంతలో ఎందుకు ఆయన వెళ్ళటం అని అనుకుంటున్నాను.ఈ లోపల ఆ ఇంట్లో వాళ్ళు బాబు అక్కడే ఉన్నట్లు మాట్లాడుకుంటున్నారు.లోపలికి పోయాను.బాబు అక్కడే ఉన్నాడు.ఏంది బాబూ,నెల్లూరు వెళ్ళానని చెప్పావు?ఇంటికి పోదాము పద అని అన్నాను.ఆ ఇంట్లో వాళ్ళు ఏమీ మాట్లడకుండా గమ్మున ఉన్నారు.నాకు కోపంవచ్చింది.మా బాబుకు తొంభై ఎనిమిది ఏళ్ళు.మా బాబుకు ఏమైనా అయిందంటే అసలు ఊరుకోను.ఆయనకు నచ్చ చెప్పి పంపించకుండా అలా మూగమొద్దుల్లాగా ఉన్నారేంది ఒక్కొక్కరూ అని అన్నాను.అప్పుడు వాళ్ళు అందరూ బాబు కు నచ్చ చెప్పి పంపించారు.ఇంటికి రాగానే,పక్కింట్లో పని అమ్మాయి కనిపించింది.తొందరగా రావే,ఇక్కడే పని చేసుకొని,తర్వాత బాబును చూసుకుంటూ ఉండు అని చెప్పాను.ఇంట్లో బాబుకు పక్కలు సర్దాను.లక్కీ కి తాతను గమనించుకుంటూ,కావాలసినది చెయ్యమన్నాను.నేను బ్యాంకుకు వెళ్ళి వచ్చేదాకా చూసుకుంటే చాలు.తర్వాత నేను చూసుకుంటాను అని చెప్పాను. ఏందో ఈ మధ్య పెద్దన్నయ్య,సీతాయి వాళ్ళు కూడా ఇలానే కలలోకి వచ్చారు.అన్నయ్యకు ఆరోగ్యం బాగా కుదుట పడింది.వాడికి వాడే నడుస్తూ,ఇల్లంతా తిరుగుతున్నాడు.పిల్లలు అమెరికా తీసుకెళ్ళేదానికి చాలా ఇబ్బంది పడ్డారు కదా!అక్కడ మందులు మంచిగా పని చేసినట్లు ఉన్నాయి అనుకుంటున్నాను.

No comments:

Post a Comment