Saturday, 11 October 2025
OSC చెక్కా?మజాకానా?
బాంకులో ఉన్నాను.గబుక్కున గుర్తు వచ్చింది.తొంభై మూడు లక్షల చెక్కు లాడ్జ్ చెయ్యలేదని.గబ గబా మేనేజరు దగ్గరికి వెళ్ళి చెప్పాను.సర్!నేను పై వారమే రిటైరు అవుతున్నాను కదా!OSC check లాడ్జ్ చేయించలేదు.ఇప్పుడు చేసేస్తాను అని.సరే అన్నాడు.లచ్చన్నను అడిగాను.మళ్ళీ కొంచెం సేపటికి అనుమానం.ఊరికే ఎంటర్ చేసాడేమో!తప్పీదారి దానిని స్లిప్ బండిల్ లో వేసి కుట్టేస్తారేమో!అప్పుడు ఎట్లా?మనమేమో ఇక్కడ ఇన్స్ట్రుమెంట్ వెళ్ళిపోయింది అనుకుంటాము.ప్రొసీడ్స్ రావు.ఎంత వడ్డీ నష్టం!మళ్ళీ సీటు దగ్గరకు వెళ్ళాను.OSC కవరింగ్ షెడ్యూలు వేయించాను.చెక్కు వెనకాల ఎండార్స్ మెంట్ స్టాంపు సరిగ్గా వేసానా అని చూసుకున్నాను.అది లేకుండా పోతే,ఆధరైశేషన్ లేకుండా పాసు కాదు కదా!ఎంటర్ చేస్తే చాలదు కదా,డిస్పాచ్ కావాలి కదా!రాఘవ ఇంటికి వెళ్ళిపోయాడు.వాళ్ళ ఇంటికి బయలుదేరాను.ఇంటి బయటే కనిపించాడు.రండి మేడమ్ అని ఇంట్లోకి తీసుకెళ్ళాడు.జయశ్రీ,పిల్లలు ఏరీ అని అడిగాను.బయటకు వెళ్ళారు మేడమ్ అని అన్నాడు.టపాల్ రిజిస్టరులో ఎంట్రీ వెయ్యాలి అన్నాను.చేసిచ్చాడు.మెట్లు దిగి వచ్చేటప్పటికి దాసు కనిపించాడు.దాసు పోస్ట్ ఆఫీసుకు వెళ్ళి,సరిగ్గా స్టాంపులు అంటించి రిజిస్టరు పోస్టు చేసిరా అని చెప్పాను.అలసి పోయాను.ఆఫీసు నుంచి బయటకు వస్తుంటే రిటైరుమెంటు పార్టీ ఇవ్వాలి కదా అని గుర్తొచ్చింది..ఆ విషయం చెప్పాను.మా వాళ్ళు ఈ రోజు వద్దులే.అందరమూ అలసి పోయి ఉన్నాము.సగం మంది ఇండ్లకు వెళ్ళిపోయారు.రేపు మంచిగా చేసుకుందాము అని అన్నారు.నేను కూడా సరే అని ఇంటికి వచ్చాను.
Tuesday, 7 October 2025
భోజనాలకు పిలిచారు…పెట్టలేదు
కాలేజీలో ఉన్నాను.చెప్పేది ఒక్క ముక్క అర్థం కావటంలేదు.సంవత్సరం అంతా రాకుండా ఒక్కరోజు వస్తే ఇంకెట్లా ఉంటుంది.పరీక్షలో పాస్ కావాలంటే ఎలా?ఏమీ రాకుండా ఎలా రాయడం?క్లాసులో వెంకటరమణ,రామచంద్రా రెడ్డి వాళ్ళు మంచి స్టూడెంట్స్.వాళ్ళని అడగాలి అని అనుకుంటున్నాను.అక్కయ్యను డాక్టరు దగ్గర కూర్చోబెట్టి,దగ్గరలో ఉండే ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాను.అక్కడకు రుక్మిణి వచ్చి ఉంది.పార్టీ ఉంది కాబట్టి నన్ను కూడా ఉండమనింది.చిన్నగా బ్యాంకు కొలీగ్స్ కూడా వస్తున్నారు.ఏమి అని అడిగితే రెడ్డిగారు మన బ్యాంకు కస్టమర్ కదా!భోజనాలకు పిలిచాడు అని చెప్పారు.మరి నాకు ఎందుకు తెలియలేదు అని అనుమానం వచ్చింది.మళ్ళీ అర్థం అయింది.నేను రిటైర్డ్ కదా!బ్రాంచ్ లో సర్క్యులర్ పంపించి ఉంటారు.ఇంకా వడ్డనలు మొదలు పెట్టలేదు.అందరూ వచ్చారు.నేను తెలిసిన వాళ్ళు కనిపిస్తే సర్ అని వెళ్ళి పలకరిస్తాను.కానీ వాళ్ళు ముందు నన్ను గమనిస్తే అలా పలకరించరు.బాథ వేస్తుంది.నేనుకూడా పలకరించకూడదు అనిపిస్తుంది.కానీ వాళ్ళలా ఉండలేను.ఇదే నా బలహీనత.నేను,సూర్యకుమారి గోడల పైన ఫోటోలు చూస్తూ ఉన్నాము.ఇంతలో అన్ని కుర్చీలు నిండి పోయాయి.వడ్డన మొదలు పెట్టేసారు.మేమిద్దరము నిలబడిపోయాము.మమ్మల్ని బయట పందిరి కింద కూర్చోమన్నారు.కూర్చున్నాము.కొంచెం సేపటికి వేరే ఇంకొందరు వచ్చారు.వారికి కూడా వడ్జనలు మొదలు పెట్టారు.మా దగ్గరకు రాలేదు.కొంచెం సేపు చూసి,సూర్యకుమారి వడ్డన చేసేవాళ్ళను అడిగింది.వండిన అన్నం బంతిలో ఉన్నవారికే సరిపోయేటట్లు లేదు.మళ్ళీ వండుతున్నాము అని అన్నారు.ఇంక ఇది అయ్యే మేళం కాదని కిందకు వచ్చేసాను.అక్కడ ఆటో అబ్బాయి కనిపించాడు.వెనక్కి తిరిగి చూస్తే అక్కయ్య కూర్చుని ఉంది ఆటోలో.అయ్యో!ఇంత సేపు అక్కయ్య నాకోసం కాచుకుని ఉందా అని దిగులు వేసింది.సారీ అక్కయ్య!పోదా పద అని ఆటో ఎక్కాను.
Subscribe to:
Posts (Atom)