Thursday, 26 March 2026
మరీ అంత భయమైతే ఎలా?
వెనకకు చూస్తే పెద్ద కొండలు.ముందుకు కొంచెం దూరం నడిచిన తరువాత లోయ వచ్చింది.మనుమరాలు కొసకు వచ్చి క్రిందకు తొంగి చూస్తుంది.అమ్మూ వెనకకు రా అని వెనక్కి లాగాను.క్రిందకు తొంగి చూస్తే ఏదో స్ట్రక్చర్ కనిపించింది.క్రిందికి వెళ్ళ వచ్చు కానీ మెట్లు లేవు.ఒక వైపు అంతా ఎవరో నిప్పు పెట్టారు.నల్లగా ఆకులు కాలి పోయి ఉన్నాయి.పాములు తిరిగే ప్రదేశం లాగుంది.దూరంగా ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ కనిపించాడు.మా అమ్మాయితో అన్నాను.అమ్మూ!ఇంక ముందుకు వద్దు.వెనక్కి వెళ్ళిపోదాము.మనము తప్పిస్తే ఇంకెవరూ లేరిక్కడ.అందులో పాములు తిరిగే ప్రదేశం లాగుంది.
అక్కయ్య వాళ్ళింట్లో ఉన్నాను.హాలులో వాళ్ళ కుక్క ఉంది.వీథిలో రెండు కుక్క పిల్లలు కనిపిస్తే తెచ్చాము అని చెబుతున్నారు.చిన్నగా వంటింట్లోకి వెళ్ళాను.ఏమీ కనిపించలేదు అవి.అమ్మయ్య అనుకుంటే వెనక్కు తిరగ్గానే గబుక్కున రెండూ వెనకనుంచి నన్ను పట్టుకున్నాయి.అక్కయ్యా!కుక్క పిల్లలు నాన్ను పట్టుకున్నాయి.వదిలించండి!అవి వదలిపెట్టడం లేదు అంటూ హాలులోకి వచ్చాను.అవి వెనకలనుంచి తలదాకా పాకేసాయి.కరుస్తాయేమో,రక్కుతాయేమో అని భయంగా ఉంది.
ఇది రాత్రి నాకొచ్చిన కల.మనం ఎంత భయస్తులం కదా!మొన్న ఆ మథ్య ట్రెక్కింగ్ కు వెళ్ళాము.ప్రతి నాలుగు మలుపులకీ నల్ల ఎలుగుబంట్లు ఉన్నాయి జాగ్రత్త!ఆలిగేటర్స్ ఉన్నాయి జాగ్రత్త అని వార్నింగ్ సైన్స్.పగలు కాబట్టి భయం అనిపించలేదు.
అక్కయ్యవాళ్ళకు కుక్క ఉంది.పరమ సాథ్వి అది.అందరినీ ప్రేమిస్తుంది.బిడ్డలనయితే మరీ!
సబ్ కాన్షస్ గా భయం ఇలా కలలాగా వచ్చింది అనిపించింది.
Sunday, 15 March 2026
Appreciation కోసం అర్రులు చాచడం
ఇంట్లో ఉన్నాను.మా పిల్లలు,అక్కయ్యవాళ్ళ పిల్లలను చూసుకుంటున్నాను.స్కూల్ డే లాగుంది.పిల్లలకు డాన్స్ మూవ్స్ నేర్పిస్తున్నాను.వాళ్ళు స్టేజ్ పైన ప్రదర్శించే రోజు వచ్చింది.పిల్లలు గ్రూప్స్ గ్రూప్స్ గా భలే చేస్తున్నారు.చాలా ముచ్చట వేసింది.ఇంతలో హెడ్ మాస్టరూ,సంగీతం టీచరూ నన్ను స్టేజ్ పైకి పిలిచారు.వెళ్ళగానే ఒక పాప వచ్చి నా పైన పూలు చల్లింది.ఆశ్చర్యం!ఏంది?నాకేనా ఈ పూలు చల్లడం?తేరుకునే లోపలే ఇంకో పాప కూడా వచ్చి మరిన్ని పూలు చల్లింది.హెడ్ మాస్టరు పిల్లలకు డాన్స్ నేర్పించినదానికి సభాముఖంగా మెచ్చుకున్నాడు.నాకు చాలా సంతోషమయింది.
నాకు మా శివయ్య చిన్నాయన గుర్తొచ్చాడు.చిన్నప్పుడు నేను డాన్సులు చేస్తుంటే ఇంకా బాగా నేర్చుకో తల్లీ అనేవాడు.నువ్వు బాగా నేర్చుకుంటే వర్ల్డ్ టూరు తీసుకెళతాను.ప్రపంచం అంతా పెర్ఫార్మెన్సెస్ చేయిస్తాను అనేవాడు.ఆఖరికి కలల్లో పిల్లలకు డాన్సులు నేర్పించుకుంటూ,మన్ననలు పొందుతున్నాను.ఎక్కడికి తృప్తి?ఉన్నంతలో సరిపెట్టుకోవాలి కదా,ఎవరైనా!
Wednesday, 4 March 2026
అంతా ఇంతా కక్కుర్తి కాదు
మొన్న కలలో...
వరండాలో అటూ ఇటూ తిరుగుతున్నాను.అమ్మాయి ఆఫీసు నుంచి సంతోషంగా వచ్చింది.ఏంది తల్లీ?అని అడిగాను.పిట్టగోడ పైన కూర్చుని,అమ్మా!నాకు జీతం పెరిగింది అనింది.వెంటనే నా నోటి నుంచి ఏమి వచ్చిందో తెలుసా?అవునా!అట్లయితే నాకు ప్రతి నెలా 200/ఇవ్వు.కాదు,కాదు.10%ఇవ్వు అని అడిగాను.సంతోషంగా ఒప్పుకుంది అమాయకపు తల్లి.నేనో!కక్కుర్తి తల్లిని.ఏమి గాడు?ముప్పూటలా తిండి తింటాను.సినిమాలూ,షికార్లూ,హోటళ్ళూ,గుడులు,గోపురాలు తిప్పుతారు.ఉత్సవ విగ్రహాన్ని తిప్పినట్లు వాళ్ళు ఎక్కడికి వెళితే అక్కడికి.ఇంక నాకెందుకు డబ్బులు?అదీ జీతంలో పర్సెంటేజ్!పదీ పరకా కాదు.ముసలితనం వచ్చేకొద్దీ కృష్ణా రామా అనుకోకుండా ఈ డబ్బు పిచ్చి ఏంది నాకు?నా వ్యవహారం పైన నాకే చిన్నతనంగా ఉంది.అవమానంగా ఉంది.
పాత రోజుల్లో ఒక వయసు వచ్చిన తరువాత మోహాలు,శోకాలు,సంపదలు వదలి పెట్టి వానప్రస్థానికి బయలు దేరే వారంట!ఇప్పుడు అది కంపల్సరీ చేయాలి,కనీసం నా లాంటివారికి.లేకపోతే కలలో కూడా బిడ్డలను పర్సెంటేజ్ అడిగేది ఏంది?మరీ విడ్డూరం కాకపోతే!మనం మన తల్లిదండ్రులకు ఏమి ఇచ్చాము?ఇస్తామన్నా మా అమ్మ నాకెందుకే అంటూ బోసినోటితో నవ్వేది.ఆ నిర్మలమయినమనసు నాకు కూడా ప్రసాదించు దేవా!
Tuesday, 3 March 2026
సుగుణతో షికారుకు సై
మొన్నీ మథ్య కలలో...
ఇంట్లో పిల్లలదెవరిదో పుట్టిన రోజు.మాఇంట్లో పుట్టిన రోజంటే పొద్దున్నే తలకు పోసుకోవడం,మథ్యాహ్నం పప్పు,పాయసం తినడం,సాయంత్రం వీలుంటే సినిమాకు వెళ్ళడం..అంతే!కానీ ఈ రోజు ఇంట్లో పది మంది దాకా ఉన్నారు.ఇంతలో సుగుణ వచ్చింది.రావే!రా!రా!అంటూ ఇంట్లోకి తీసుకుని వచ్చాను.తనను కూర్చోబెట్టి హడావుడిగా తిరుగుతున్నాను.ఒక అరగంట తర్వాత నాతో ఇలా అనింది.పద్మా!ఈ రోజు అంతా నిన్ను నాతో తిప్పుదామనుకుని నచ్చాను.సాయంత్రందాకా ఊరికే ఇట్లా కూర్చోలేను.నువ్వు వస్తే తీసుకెళతాను.లేకపోతే నేనొక్కదానినే వెళతాను అంది.
నాకు ఏమి చెయ్యాలో పాలుపోలేదు.ఎందుకంటే అంతకు ముందు ఒకసారి తనతో తీసుకెళ్ళింది.ఒక టివి షో రూము ఓపనింగు,ఒక రూరల్ హాస్పిటల్లో పోలియో డ్రాప్స్ ప్రొగ్రాము,ఒక గ్రామంలో పొంగళ్ళు,ఆ సభలో అనర్గళంగా తను అరగంట మాట్లాడడం,ఫ్రెండు ఇంట్లో భోజనము...తనకు అలవాటేమో గానీ నాకు మటుకు భలే సంతోషంగా ఉణ్ణింది తనను అలా నేరుగా చూడడం.గ్రేట్ కదా!చిన్నప్పుడు కలసి బడికి వెళ్ళిన వాళ్ళము,కలసి డాన్సులు,డ్రామాలూ వేసిన వాళ్ళము.గ్రౌండులో టెన్నీకాయిట్ ఆడుకున్న వాళ్ళము.ఇప్పుడు ఇంత పెద్ద పదవిలో ఉండి,అందరినీ రంజింప చేస్తుంది అంటే!అదేదో ఆ గొప్ప అంతా నాదే అన్నట్లు అనుభూతి.నేనే సాథించాను ఆ పేరు మొత్తం అన్నట్లు గర్వం!
ఇప్పుడు మళ్ళీ పిలుస్తుంది తనతో తీసుకెళతానని.ఉండబట్టలేకపోయాను.ఒక్క క్షణం మనసు తటపటాయించింది. బిడ్డ పుట్టినరోజుకు ఇంట్లో బిడ్డతో ఉండకుండా బయటకు వెళ్ళడమా,అని.కానీ టెంప్టేషన్ తట్టుకోలేకపోయాను.నేరుగా పాప(ఆడబడుచు)దగ్గరికి వెళ్ళాను.పాపా!నేను ఇంట్లో వంటంతా చేసి పెట్టేసి పోతాను.ఇంట్లో ఎవరూ నన్ను అడగకుండా,నా అవసరము ఎవరికీ అక్కరలేకుండా ఉండేలా చూసుకో!పాప సరే వదినా అంది.ఇంకేమి అట్లయితే?సంతోషంగా ఎసరు పెట్టేదానికి వంటింట్లోకి బయలుదేరాను.
thanks sunguna for lifting up my spirits even in dreams!
Subscribe to:
Posts (Atom)