Wednesday, 17 June 2026
ISC realisation అర నిమిషంలో
రాత్రి కలలో...
బ్రాంచ్ కి కొత్త మేనేజరు వచ్చాడు.కాఫీకని లంచ్ రూముకి వెళితే కలిసాడు.ఇద్దరమూ హాయ్ అనుకుని,మాట్లాడుకున్నాము.అట్లానే మాట్లాడుకుంటూ సీటు దగ్గరకు వచ్చాను.నలుగురు కొలీగ్స్ నా వెనకల అంటున్నారు.ఎవరు వచ్చినా మొదట ఫ్రెండు చేసుకుంటుంది అని.నేరుగా వాళ్ళ దగ్గరకు వెళ్ళి అన్నాను.నేను రోజీ చీక్సు,ఫెయిర్ స్కిన్ లా కాదు.నేను మెలికలు తిరగడం,మందగమనలా కాదు.అందరినీ సమానంగా చూస్తాను.IQ,తెలివితేటలతో ఫ్రెండ్సు చేసుకుంటాను.చిన్న సైజు సంభాషణ చెప్పి,నా సీటు దగ్గరకు వెళ్ళాను.కస్టమరు ISC(inward sights for collection) ఇంటిమేషన్ లెటరు పట్టుకొచ్చాడు.తీసుకుని చూసాను.పాత ఇన్స్ట్రుమెంటు లాగుంది.పాత రిజిస్టరు వెతికి,చూసాను.నంబరు 82,అమౌంటు రూ.1066/.కనిపించింది.రౌండు చేసి,డేట్ ఆఫ్ రియలైజేషను వేసాను.వెంటనే చలాను రాసిచ్చాను.అతను చాలా ఖుష్!తొందరగా చేసిచ్చానని.తాంక్స్ చెప్పి వెళ్ళాడు.
Friday, 12 June 2026
కాలేజీ కెళ్ళాలంటేనే కష్టాలు
రాత్రి కలలో....
పొద్దున లేచి కాలేజీకని హడావుడిగా రెడీ అవుతున్నాను.గబ గబా మెట్లు దిగి బయలుదేరాను.మునిసిపల్ ఆఫీసు దగ్గరకు వస్తున్నాను...ఇంతలో కాలేజీ బస్సు రై రై అంటూ దూసుకుని పోయింది.స్టాప్ లో ఎవరూ ఉన్నట్లు లేరు.అందుకే ఆగినట్లు లేదు.ఆటో స్టాండు దగ్గరకు వెళ్ళాను.SPW కాలేజీకి ఎంత అని అడిగాను.ఐదు వందలు అన్నాడు.నిన్నటి దాకా పది రూపాయలకే వచ్చారుకదా!ఆఖరుకు మూడు వందలకు ఒప్పుకున్నాడు.ఇంతలో పక్కనే ఉన్న ఇంకో ఆటో అతను రెండు వందలకు వస్తాను అన్నాడు.సరే అంటే ఇక్కడే ఉండండి.నా ఆటో తెస్తాను అని వెళ్ళాడు.మిగిలిన వాళ్ళంతా భయపెట్టారు.వాడికి అసలు లైసెన్ను లేదు.అసలు ఆటో కూడా వాడిదికాదు అంటూ.కానీ నేను ఆ ఆటోలోనే ఎక్కాను.ఆటో దేవేంద్ర తియేటరు దగ్గరకు రాగానే,నా దగ్గర డబ్బులు అస్సలు లేవని గుర్తొచ్చింది.గబక్కని ఆటో ఆపి,ఇంటికి పరుగెత్తాను.వీథిలో వాళ్ళందరూ చూస్తున్నారు..కాలేజీకి పోకుండా ఇంటికి ఎందుకు వెళుతున్నాని.ఏమ్మా?ఏమైంది?అని అడిగింది అమ్మ.
అమ్మకు చెప్పాను ఆటోకు రెండు వందలు అడిగారు అని.అమ్మ నా పర్సులో ఏభై రూపాయల కాగితాలు కొన్ని కుక్కింది.పెరుగన్నం డబ్బాలో పెట్టిచ్చింది.మరీ ఎక్కువ కదమ్మా ఆటోకి రెండు వందలు అంటే.యాభైకో,వందకో వస్తారేమో అడుగు అంది అమ్మ.సరే అని కిందకు పరుగులు తీసాను.వీథి చివర రోడ్డుకు ఆటు పక్కన ఆటో కనిపించింది.పిలిస్తే వచ్చాడు అతను.దగ్గరకు వస్తే అది ఆటో కాదు.కారు,టాపు కూడాలేదు.SPW కి వెళ్ళాలి.కారు అంటే ఎక్కువ కదా అని అన్నాను.వందకు వస్తావా అని అడిగితే సరే అని ఎక్కించుకున్నాడు.చిన్నగా,ఎవరు కనిపించినా ఆగుతూ,ఎక్కుతారా అని అడుగుతూ పోతున్నాడు.
Monday, 8 June 2026
Much ado about nothing అంటే ఇదే కదా!
రాత్రి కలలో.....
తెల్లవారే లేచి నెల్లూరు బయలుదేరాలి.అందులో శుక్రవారం!తప్పకుండా తలకు పోసుకుని వెళ్ళాలి.పొద్దున్నే లేచి వంటింట్లోకి వెళ్ళాను.అత్త కూర్చుని ఉంది పొయ్యి ముందర.కుంపట్లో పెద్ద గిన్నెలో నీళ్ళు కాగుతున్నాయి.పరవాలేదు.ఇంతలోపల వేసుకోవాల్సినవి,తీసుకెళ్ళాల్సిన బట్టలు సర్దుకుని వస్తాను అని లోపలకు వెళ్ళాను.పని చూసుకుని వచ్చి చూస్తే గిన్నెలో నీళ్ళు చల్లగా ఉన్నాయి.అదేంటి?చిన్నమామ కాగిన తీసుకుని వెళ్ళిపోయడు తను స్నానం చేసేదానికి.అసలే తలకు పోసుకోవాలి.ఒక గిన్నె చాలదు.ఇది కాగేదెప్పుడు?మళ్ళీ ఇంకో గిన్నె కాగేది ఎప్పుడు?ఇట్లాకాదు అని స్నానాల గదిలోకి వెళ్ళి చూసాను.కట్టెల పొయ్యిలో నిప్పులు నివురు గప్పి ఉన్నాయి.నాలుగు కట్టె పుల్లలు వేసి విసిరాను.మంట రాజుకుంది.ఇంక ఫరవాలేదు.అండాలో నీళ్ళు పోసి వచ్చాను.ఇంట్లోకి పోయి వస్తుంటే రాముడు వంటింటి దగ్గర ఉన్నాడు.కాఫీ కోసమేమో?రేయ్!పాలు ఇంకా రాలేదు.అన్నాను.వెంటనే చిన్నమామ,పాలు ఇప్పుడే వచ్చాయి అమ్మాయి అన్నాడు.ఇంకేముంది?వెళ్ళి డికాషన్ పెట్టి,పాలు కాచాను.
మళ్ళీ దొడ్లోకి వచ్చి చూస్తే నీళ్ళు ఇంకా కాగలేదు.ఇట్లాకాదు అని మూడు రాళ్ళు పెట్టి,వాటి పైన నీళ్ళ గిన్నె పెట్టి,మళ్ళీ మంట రాజేస్తున్నాను.ఇంతలో లక్ష్మీనారాయణ వచ్చాడు.వదినా!సింగు వాళ్ళ అక్కకు బాగలేదంట.నీతో మాట్లాడాలి అంటున్నాడు.ఆ అబ్బాయితో మాట్లాడి,వెనక్కి చూస్తే మళ్ళీ పొయ్యి మండడం లేదు.కోపము,అసహనము,అసంతృప్తి,విసుగు,చీదర అన్నీ చుట్టుముట్టాయి.ఇంట్లోకి వెళ్ళాను.ఎవరు చూసినా చిటమటమంటున్నాను.ఎప్పుడూ శాంతమూర్తి లాగ,మొహమాటానికి ఎందుకు నవ్వాలి?ఒక్క సారైనా నా కోపమూ,విసుగూ అందరూ చూడనీ అనిపించింది.ఇంతలో మణిమాల వచ్చి అనింది.పద్మా!పొద్దున్నే ఊరికి వెళతానంటివే!ఇప్పుడే మేమందరమూ గీజర్ వేసుకుని వేడినీళ్ళతో స్నానాలు కానిచ్చాము.
నాకు దిమ్మ తిరిగి పోయింది.ఇంట్లో గీజర్ ఉంటే కట్టెల పొయ్యి మండలేదని,కుంపట్లో నీళ్ళు సల సల కాగటం లేదని పొద్దుటి నుంచీ మధ్యాహ్నం దాకా టైము వేస్ట్ చేశానా నేను?ఏడవాలో,నవ్వాలో అర్థం కాలేదు.
Subscribe to:
Posts (Atom)