Saturday, 14 February 2026
అమ్మ,ప్రసాదు కనిపించారు
ఈ రోజు ప్రసాదు(మా ఆయన)పోయిన రోజు.అలవాటు ప్రకారం అర్ధరాత్రి మెలకువ వచ్చింది.యథాప్రకారం కాఫీ త్రాగి,రామకోటి,భాగవతము,భగవద్గీత రాసుకుని అయిదప్పుడు పడుకున్నాను.కలలో....
చాలామంది గుంపుగా,గలభాగా ఉన్నారు.మథ్యలో రామ్ చరణ్ ఏదో పాటకు డాన్స్ చేస్తున్నాడు.గబుక్కున తల ఎత్తి నా వైపు చూసాడు.నేను చెయ్యి ఊపాను.ఎంత ఊపినా రెస్పాన్స్ ఇవ్వడే?మనది ట్యూబ్ లైట్ బుర్ర కదా!మూడు సందుల అవతల తను ఉన్నాడు.నేను మూడంతస్తుల నేడ పైన చీకట్లో ఉండి చేయి ఊపితే ,ఏ మానవ మాత్రుడికి కనిపిస్తుంది?
ఇంట్లోకి వచ్చాను.మా చిన్నప్పటి ఆరో క్లాస్ ఫ్రెండు ఫోన్ చేసింది.నువ్వు ఎట్లున్నావే అంటే నువ్వు ఎట్లున్నావే అనుకున్నాము.యంగర్ డేస్లో ఎంత బాగా రెడీ అయ్యేదాన్నో,మా ఆయన కూడా డార్క్ కలర్ సూట్ వేసుకునేవాడు అంటూ తీపి జ్ఞాపకాలు నెమరువేసుకుంది.నేను ఏమైనా తక్కువ తిన్నానా?నేనూ చెప్పాను.అసలు మాఆయనకు నేను ఎట్లా ఉన్నా ఓకేనే. ఎప్పుడైనా బయటకు వెళ్ళేటప్పుడు..ఏమయ్యా!ఈ చీర బాగుందా?లేక మార్చేదా?అని అడిగితే నువ్వు ఎట్లా ఉన్నా బాగుంటవు.ఏమీ మార్చబళ్ళేదు.పోదాం పద అనేవాడు అంటూ నేను కౌంటర్!
కిటికీలోనుంచి చూస్తే పెద్దక్కయ్య కనిపించింది .గబగబా వెళ్ళి తలుపు తీసాను.అక్కయ్య పావడా పమిటలాగా చీర కట్టుకుని ఉంది.ఏంది ఇది కట్టుకున్నావు?పావడా పమిటనా,లేక అలాంటి చీరనా అని అడిగాను.ఈ మధ్య వాళ్ళెవరో పెట్టారులే.అందుకని కట్టుకున్నాను అని చెప్పింది.డ్యూటీ నుంచి వస్తూ,పెళ్ళికి వెళ్ళొచ్చాను.వాళ్ళు పద్మ రాలేదా అని అడిగారు.నీవు రాలేదని వంటకాలన్నీ నా దగ్గర పంపించారు.కంచాలు పెట్టుకోండి,వడ్డిస్తాను అంది అక్కయ్య.
అమ్మను కూడా కూర్చోమన్నాను.అమ్మ కుర్చీలో కూర్చుంది కానీ టేబులు దగ్గరకు జరపలేక లేక పోతుంది.ప్రక్కలకు ఒరిగి పోతుంది.గబగబా వెళ్ళి అమ్మ కూర్చున్న కుర్చీ సరిగ్గా జరిపాను.నాకు బాథగా ఉంది.అమ్మ ఎన్నేళ్ళు ఎంత కష్ట పడింది!తన పెళ్ళైన ఎనిమిదవ ఏట నుంచి ఎనభై ఏళ్ళు వచ్చేదాకా కష్టపడుతూనేఉంది.మాకేకాదు,మా పిల్లలకు,వాళ్ళ పిల్లలకు కూడా!ఎన్ని సార్లు మంచాన పడింది?మళ్ళీ చిన్నగా కోలుకుని,తన పనులు తను చేసుకుంటుంది.ఎవరినీ ఇబ్బంది పెట్టడం లేదు.
అందరికీ వడ్డిస్తున్నాను.నాకు ఎదురుగా ప్రసాదు కూర్చున్నాడు.తనకు మంచి భోజనం తినాలంటే చాలా ఇష్టం.అనుకోకుండా పెళ్ళి భోజనం తింటున్నాము,మామూలుగా కాకుండా!గబగబా సాదకాలు వేసుకునే తొందరలో కూర గిన్నె బోర్లించేసాడు.ఆశ్చర్యం!నాకు కోపమే రాలేదు.చిన్నగా మళ్ళీ గిన్నెలోకి తీసాను.
Subscribe to:
Post Comments (Atom)
Kalatha nidra! Let there be calm mind and good sleep .
ReplyDeleteMana mitta veedhi loni podugu ammayi (peru gurthu ledu Bramaraamba ?/ Bhavani? ) naaku kala loki vachchindi. Paristhithi baagunnatlu ledu. Entha mandi pillaalu ? Tana Jeevitham Ela vundi?
ReplyDelete