Tuesday, 14 April 2026
చిన్నక్కయ్య కారు తోలుతుంది
తెల్లవారు ఝామున కల!అందరమూ కారు దగ్గరకు వచ్చాము.డ్రైవరుకు వైజాగు వెళ్ళాలి.అక్కడ ఎక్కడికి వెళ్ళాలో చెబుతున్నాను.ఇంతలో చిన్నక్కయ్య కారు ముందు సీట్లో కూర్చుంది.సరే అని నేను వెనక కూర్చున్నాను.కొంచెం సేపు తర్వాత చూస్తే అక్కయ్య డేరైవింగు సీట్లో కూర్చుని స్టీరింగు తిప్పుతుంది.డ్రైవరు నా ప్రక్కన దిక్కులు చూస్తూ కూర్చుని ఉన్నాడు.ఒక్క క్షణం భయం వేసింది.అక్కయ్యా!అక్కడ కూర్చున్నావు ఏంది?నీకు అసలు కారు నడపడం వచ్చా?ఎప్పుడు నేర్చుకున్నావు?నేనెప్పుడూ ఇంతకు ముందు నువ్వు కారు డ్రైవ్ చేయడం చూడలేదు.అని అన్నాను.
అక్కయ్య ఏమో తొణకలేదు.బెణకలేదు.తాపీగా అంటున్నది.నాకెందుకు రాదు?అంతకు ముందు అంతా పిచ్చి పిచ్చిగా ఎప్పుడు పడితే అప్పుడు కారుతోలేదాన్ని.ఈ మధ్యకాలంలో చేయడం లేదు,అంతే.నాకు ఇంకా భయం తీరలేదు.మరి అలాంటప్పుడు కొంచెం ప్రాక్టీసు ఉండాలి కదా!అందులో లోకల్ గా తిరగడం కాదు.హైవే పైన పోవాలి.
నా కలల్లో నేను ఎప్పుడూ సైకిలు త్రొక్కుతున్నట్లు ఉంటుంది .ఇట్లా కార్లు,విమానాలు తోలుతున్నట్లు ఒక్కసారి కూడా రాలేదు.మా అక్కయ్య కారు తోలుతున్నట్లు వచ్చింది.మరీ మోసం కదా!ఇంకా ఎన్ని రోజులు సైకిలు తొక్కితే కారు డ్రైవింగ్ కి ఎలిజిబిలిటీ వస్తుందో ఈ కలల్లో!అస్సలు అంతు చిక్కడం లేదు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment