Monday, 13 July 2026
CM గారు,వారి కోడలితో భేటీ
రాత్రి కలలో....నేను,ప్రసాదు పిల్లలను పార్కుకు తీసుకెళ్ళాము.వాళ్ళు ఆడుకుంటున్నారు.ప్రసాదు కారు ఎక్కు అని నన్ను తీసుకెళ్ళాడు.అక్కడ తాటి చెట్లు టెంకాయ చెట్లు ఏపుగా పెరిగి ఉన్నాయి.అందులో ఒక దానికి మొత్తం పూలతీగె చుట్టుకుని ఉంది పైదాకా.చిన్న చిన్న తెల్ల పూలు నక్షత్రాల్లా చెట్టు పైదాకా కనిపిస్తున్నాయి.నాకు అది చూపించేగానికి పిలుచుకుని వచ్చాడు.పిల్లలు భయపడతారు ఒంటరిగా...అని వెనక్కు వచ్చేసాము.
అక్కడ చంద్రబాబు నాయుడు గారి కోడలు వాకింగ్ చేస్తుంది.నేను ఆ అమ్మాయి దగ్గరకు వెళ్ళి అడిగాను నాకు కొంచెం సహాయం కావాలని.ఇంతలో CM గారు వచ్చారు తనను పిలుచుకుని వెళ్ళేదానికి.నన్ను చూసి ఏమి కావాలి అన్నారు.నేను చెప్పడం మొదలుపెట్టాను.సర్,నేను 1976లో రిసర్చ్ లో చేరాను.role of growth promoters and growth retardants in cucurbutacea...నా ప్రాజెక్ట్.1977లో UGC ఫెలోషిప్ వచ్చింది.కానీ 1978లో బాంకు ఉద్యోగం వచ్చింది అని మానేసాను.నేను కంటిన్యూ చేయాలంటే యూనివర్సిటీ వాళ్ళు ఒప్పుకోవడం లేదు.మీరు ఒకమాట చెప్పారంటే చాలు.నేను రిసర్చ్ కంటిన్యూ చేసుకుంటాను.నా దగ్గర అన్ని సర్టిఫికేట్లు ఉన్నాయి.UGC సాంక్షన్ లెటర్ తప్ప.కావాలంటే రేపు పొద్దున మీ ఇంటికి తీసుకు వచ్చి చూపిస్తాను.
అలాగే పొద్దున్నే,పరగడుపున వెళ్ళాను.వాళ్ళంతా ఇంకా రెడీ కూడా కాలేదు.వాళ్ళతోటి నాకు ఉప్మా పెట్టారు,తినమని.ప్పపంచమంతా,ప్రతి ఇంట్లో పొద్దున ఉప్మానే చేసేటట్లు ఉంది.తొందరగా అయిపోతుందని.ఇంతలో మైథిలి ఫోన్ చేసింది...ఇంట్లో టిఫిన్ ఉంటే వస్తాను మేడమ్ అంటూ.సరే రా!అందరమూ కలిసి ఉప్మా తిందాము ..అని అన్నాను.
Subscribe to:
Post Comments (Atom)
😀😀 wonderful dream👌
ReplyDelete