Saturday, 11 July 2026
ఎర్రటి సరిగె అంచు వెంకటగిరి చీరలో అత్త
ఈ మధ్య big island,hawaii కి వెళ్ళాము.విమానాశ్రయం నుంచి బయటకు వచ్చి,బస్ స్టాప్ దగ్గరకు వెళుతున్నాము.అర్థరాత్రి అయింది.పిల్లలు భరిణె పురుగులను చూసారు.కొన్ని పెద్దవి ఎగురు తున్నాయి.వీళ్ళు కెవ్వు కెవ్వు మంటూ పరుగులు...వాళ్ళ పైన ఎక్కడ వాలతాయో అని.నిన్నంతా పాత ఫోటోలు చూస్తున్నాను..।అమ్మ వాళ్ళ ఇంట్లో వరలక్ష్మీ వ్రతమూ,అత్తతో మా ఫోటోలు.
రాత్రి కలలో...।నెల్లూరు లోని మెడ్రాసు బస్ స్టాండు ఇంట్లో అందరమూ ఉన్నాము.దొడ్డి తట్టు వెళ్ళి చూసాను.కాలు ఆనించేదానికి వీలు లేకుండా భరిణె పురుగులు.ఓ యమ్మో!ఇవి ఇంట్లోకి ఏమైనా వచ్చాయా అని వెనక్కి తిరిగి చూసాను.హమ్మయ్య!ఇంట్లోకి రాలేదు.జాగ్రత్తగా చెప్పులు వేసుకుని,ఇంటి ముందర తట్టుకు బయలు దేరాను.అందరూ అక్కడే ఉన్నారు.వాసు అన్నాడు.వదినా!ఈ సారి అందరికీ సర్ప్రైజ్.నేను ఎక్కువ మాట్లాడను అనుకుంటారు కదా!అలా అని పట్టు శాలువా కప్పాడు నాకు.వదినకు చీర,జాకెట్టు తాంబూలంలో పెట్టి ఇవ్వు అని జానకితో అన్నాడు.నేను అన్నాను.మరీ వీథిలో,బయట ఎందుకులే,లోపల ఇద్దువుగానీ జానకి అని.అందరమూ తలుపూరు బయలు దేరుతున్నాము.అత్త కొత్త సరిగంచు ఎర్ర వెంకటగిరి చీర,ఎర్ర జాకెట్టు వేసుకుని వచ్చింది.భలే ఉంది.మెరిసి పోతూ ఉంది.అత్తా!మనము తలుపూరు వెళ్ళి,అక్కడ కదా వరలక్ష్మీ వ్రతం చేసుకునేది.ప్రయాణంలో చీర నలిగి పోతుంది కదా!అని అన్నాను.పరవా లేదులే,అమ్మాయి.అనవసరంగా ఇంకో గంట లేచు అవుతుంది అని ఒకేసారి రెడీ అయ్యాను అని అత్త అంది.
Subscribe to:
Post Comments (Atom)
😄👌
ReplyDelete